కాజీపేట, ఆగస్టు 5: కాజీపేట రైల్వే జంక్షన్ -హసన్పర్తి రోడ్ రైల్వే స్టేషన్ల మధ్యలోని వడ్డేపల్లి ఆర్ఓబీ రైలు పట్టాల మధ్య గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం గుర్తించినట్లు జీఆర్పి పోలీసులు తెలిపారు. జీఆర్పి సీఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్డేపల్లి ఆర్ఓబీ సమీపంలోని రైలు పట్టాల పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలో మృతదేహం ఉన్నట్లు రైల్వే అధికారుల నుంచి సమాచారం వచ్చిందన్నారు. సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడంతో డ్రైనేజీలో కాళ్లు, చేతులు ముడుచుకొని వృద్ధుడు చనిపోయి ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. మృతుడు సుమారు (65-70 ) ఏండ్ల మధ్య వయసు, 5′ 5 ఎత్తు కలిగి, ఎడమ చేతి పై పుట్టుమచ్చ ఉందన్నారు.
మృతుడు వంటిపై పసుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్టు, బెల్లం కలర్ లోయర్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వేషధారణ బట్టి బిక్షాటన చేసే వ్యక్తిగా భావిస్తున్నట్లు చెప్పారు. మృతుడు తన వ్యక్తిగత అనారోగ్య కారణాలవల్ల, రెండు మూడు రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చు నని, మృతుడి శరీరం వాసన వస్తుందన్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీ నందు భద్ర పరిచామని, మృతునికి ఎవరైనా సంబంధికులు ఉన్నా, ఎవరికైనా ఆచూకీ తెలిసినచో కాజీపేట జీఆర్పీ, లేదా ఈ క్రింది సెల్ నంబర్లు 87126
58609, 94400 27342 సంప్రదించాలని కోరారు.