వరంగల్ చౌరస్తా: తలసేమియా(Thalassemia) బాధితుల కోసం యువన నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శుక్రవారం ఎంజీఎం హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 యూనిట్ల రక్తాన్ని దాతల నుండి సేకరించారు.
ఈ సందర్భంగా యువ నేతాజీ ఫౌండేషన్ చైర్మన్ కొత్తకొండ అరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల వర్ధంతిని పురస్కరించుకొని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నివేదన -2 కార్యక్రమం ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం హాస్పిటల్ ఆర్.ఎం.ఓ డా. శ్రీనివాస్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డా. ఆశాదేవి, ఎంజీఎం వైద్యాధికారులు, వైద్యులు, ఫౌండేషన్ సభ్యులు స్విమ్మర్ రాజు, బొట్టు కమలాకర్, పృథ్వీ, తదితరులు పాల్గొన్నారు.