భీమదేవరపల్లి, మార్చి 9: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రజా గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనుహ్య స్పందన లభించింది. రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్ఎస్ఎస్, యూత్ కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేయడం వల్ల మరికొందరి ప్రాణాలు నిలబెట్టవచ్చని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ స్టాప్ డాక్టర్ కిషన్ రావు, శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ఇంచార్జి సౌమ్య, కొత్తకొండ దేవస్థానం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు ఘనబోయిన శ్రీకాంత్, గజ్జల రమేష్, బొల్లంపల్లి రమేష్, అనిల్, అరవింద్, వల్లపు మహేందర్, ప్రశాంత్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.