మంచి చేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి
మంచి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో మన ఊరు, మన రమణన్న కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే గండ్ర మంగళవారం ఉదయం వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి గ్రామంలో తిరుగుతూ అందరినీ పలకరించారు.
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- పత్తిపాకలో ‘మన ఊరు – మన రమణన్న’ కార్యక్రమం
- పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం
- హాజరైన వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
శాయంపేట, ఆగస్టు 22 : మంచి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో మన ఊరు, మన రమణన్న కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే గండ్ర మంగళవారం ఉదయం వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి గ్రామంలో తిరుగుతూ అందరినీ పలకరించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భగా ముస్లింలు ఖబ్రస్థాన్‌కు నిధులు కేటాయించాలని కోరగా రూ.5లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే, గ్రామంలో రూ.10లక్షలతో చేపడుతున్న పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. మన ఊరు మన బడి ద్వారా రూ.1.05కోట్లతో నూతనంగా నిర్మించిన రెండు అదనపు గదులు, పాఠశాల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ.1.56లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అలాగే, రూ.5.05లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండలానికి చెందిన ఇద్దరు మైనార్టీలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.లక్ష సాయం చెక్కులను గండ్ర దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఉద్యమ నేతగా రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా దేశంలోనే రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భూపాలపల్లికి కొత్తగా బాలుర డిగ్రీ కళాశాల మంజూరైందని, ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తామన్నారు.
స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి అంకితభావంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని కొనియాడారు. పత్తిపాక పంచాయతీ ఉత్తమ పురస్కారం అందుకోవడంపై అభినందించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందన్న మాటలను తిప్పి కొడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోకే పిల్లలను పంపించాలని సూచించారు. మంచి మనసున్న నాయకుడు కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి హరిప్రసాద్, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంఈవో రమాదేవి, తహసీల్దార్ సుభాషిణి, సర్పంచ్‌లు చిట్టిరెడ్డి రాజిరెడ్డి, అబ్బు ప్రకాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, పీఆర్ డీఈ లింగారెడ్డి, ఎంపీటీసీలు బాసాని చంద్రప్రకాశ్, మేకల శ్రీనివాస్, వావిలాల వేణుగోపాల్, దైనంపల్లి సుమన్, గోలి మహేందర్‌రెడ్డి, గంటా శ్యాంసుందర్‌రెడ్డి, పసుల ప్రవీణ్, ప్రకాశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

