వరంగల్ చౌరస్తా: ఆక్రమ కేసులతో కాంగ్రెస్ ప్రతిష్టను, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తగ్గించలేరని, ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. బుధవారం వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను చేర్చడాన్ని వ్యతిరేఖిస్తూ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశ రాజకీయాలలో చరిత్ర కలిగివున్న కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
అందులో బాగంగానే పార్టీ పెద్దలను టార్గెట్ చేస్తూ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను చేర్చి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా బీజేపీ చరిష్మా తగ్గుతూ, కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచుకుంటున్న ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తున్నదని విమర్శించారు. కన్యాకురి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన ప్రజల కష్టాలను తెలుసుకున్న రాహుల్ గాంధీపై బురద వల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.
భవిష్యత్తు రాజకీయాలలో బీజేపీ చేసే కుట్రలను భగ్నం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీని బొందపెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుండేటి నరేందర్, బస్వరాజు శిరీష, శ్రీమాన్, దామెర సర్వేషం, బిల్ల శ్రీకాంత్, దూపం సంపత్, జన్ను రవి, జన్ను అరుణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, ఎండీ సలీం, రాజనాల శ్రీహరి, గోరంటల రాజు, చాగంటి శ్రీనివాస్, కరాటే ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.