కమలంలో అయోమయం
కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ పరిస్థితి ఇక్కడ మాత్రం అయోమయంగానే ఉన్నది. శుక్రవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నది. రాష్ట్రంలో మొత్తం 17స్థానాలకు గాను 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ, వరంగల్‌లో మాత్రం తేల్చకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
- వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని తేల్చని బీజేపీ
- నాలుగో జాబితాలోనూ లేని వరంగల్ పేరు
- అభ్యర్థుల ప్రకటనలో దేశవ్యాప్తంగా ముందున్నా.. ఇక్కడ మాత్రం వెనుకంజ
- సరైన నేతలు లేనందునేనా?
కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ పరిస్థితి ఇక్కడ మాత్రం అయోమయంగానే ఉన్నది. శుక్రవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నది. రాష్ట్రంలో మొత్తం 17స్థానాలకు గాను 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ, వరంగల్‌లో మాత్రం తేల్చకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు టికెట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా, ఆ పార్టీకి సరైన నేతలు కరువైనందునే అరూరిని చేర్చుకొని టికెట్ ఇస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
– వరంగల్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్ ఎంపీ టిక్కెట్‌పై బీజేపీ ఎటూ తేల్చడం లేదు. శుక్రవారం నాలుగో జాబితాను ప్రకటించినా అందులో వరంగల్ పేరు లేదు. ఈ జాబితాతో కలిపి దేశ వ్యాప్తంగా 291 సీట్లకు బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించినా వరంగల్‌కు ఎవరనేది మాత్రం తేల్చలేదు. అభ్యర్థిని ప్రకటించకపోవడంతో బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొన్నది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి, ప్రచారాన్ని సైతం మొదలు పెట్టింది. మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, గత ఎన్నికల్లో పోటీ చేసిన చింతా సాంబమూర్తి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టీ కృష్ణ ప్రసాద్ ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశించినా ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల స్థానాన్ని బీజేపీ కేటాయించింది. దీంతో స్థానిక నేతలే ఇప్పుడు టిక్కెట్ కోసం రేసులో ఉన్నారు.
సరైనోళ్లు లేకనే!
వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు బీజేపీలో సరైన నాయకులు లేనందునే ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేక పోతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మొదటి నుంచీ బీజేపీలో ఉన్న నాయకులెవరూ లేరు. గుండె విజయరామారావు, అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. కొండేటి శ్రీధర్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ ముగ్గురు నేతల్లోనే ఒకరికి టికెట్ రావాల్సి ఉన్నది. వరంగల్ స్థానంలో బీజేపీ గతంలో ఒకసారి గెలిచిందని, ఈ సెగ్మెంట్లో సరైన అభ్యర్థిని నిలిపితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పలుమార్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే కోణంలో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నది. వరంగల్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే వరకు ఆగడమా, ముందుగానే ప్రకటించడమా అనే విషయంలో ఆలోచిస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున మరో రెండుమూడు రోజుల్లో బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటనలో ముందున్న బీజేపీ, వరంగల్ సీటుపై మాత్రం నాన్చుడు ధోరణితో ఉండడం కాషాయ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

