పరకాల, సెప్టెంబర్ 18 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ర్టాన్ని పాలించడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. హనుమకొండలోని తన నివాసంలో గురువారం పరకాల మండలం మల్లకపేటకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చల్లా సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. యూరియా దొరకక అన్నదాతలు చెప్పులు క్యూలో పెట్టి రోజుల తరబడి పడిగాపులు ప డాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎకడని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని, 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు కాలేదన్నారు.
వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ప్రజలకు వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బం డి ఉదయ్ కిరణ్, తాళ్ల ప్రదీప్, బూతు కమిటీ అధ్యక్షుడు గురజాల శివరాజు, బొజ్జమ్ శివ, కాంగ్రెస్ బూత్ కమిటీ అధ్యక్షుడు చెన్న రాజేందర్ తదితరులున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాజీ వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, మాజీ సర్పంచులు సుమాల శ్రీనివాస్, బయ్యా రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.