కాంగ్రెస్‌కు ఓటేస్తే రౌడీ రాజ్యమే..
కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపిస్తే రౌడీలు రాజ్యమేలుతారని భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, 11వ వార్డు కౌన్సిలర్ బానోత్ రజితా జుమ్ములాల్ ఆధ్వర్యంలో మంగళవారం వేశాలపల్లి, భాస్కర్‌గడ్డలో ఎ మ్మెల్సీ సారయ్యతో కలిసి గండ్ర ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
- ఆ పార్టీలో అసమ్మతి సునామీ మొదలైంది
- జండుబామ్ పెట్టుకొని ఏడ్చే వారి మాటలు నమ్మొద్దు
- ప్రత్యేక దృష్టితో విలీన గ్రామాలను అభివృద్ధి చేశా
- బీఆర్ఎస్ పేదలకు ఆక్సిజన్ ఇచ్చేపార్టీ
- జిల్లాకు 500 పడకల దవాఖాన, మైనింగ్ ఇంజినీరింగ్ కళాశాలను తీసుకొస్తా
- భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర
- వరంగల్‌కు పోటీగా భూపాలపల్లిని గండ్ర అభివృద్ధి చేశారు
- ఎమ్మెల్సీ సారయ్య
- గోరికొత్తపల్లి మండలంలో ఆత్మీయ సమ్మేళనాలు, భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రచారం
కృష్ణకాలనీ/ రేగొండ, (గోరికొత్తపల్లి) అక్టోబర్ 31 : కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపిస్తే రౌడీలు రాజ్యమేలుతారని భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, 11వ వార్డు కౌన్సిలర్ బానోత్ రజితా జుమ్ములాల్ ఆధ్వర్యంలో మంగళవారం వేశాలపల్లి, భాస్కర్‌గడ్డలో ఎ మ్మెల్సీ సారయ్యతో కలిసి గండ్ర ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. అలాగే గోరికొత్తపల్లి మండలకేంద్రంతో పా టు నిజాంపల్లె, రాజక్కపల్లె, దామరంచపల్లె, చిన్నకోడెపా క, చెన్నాపురం గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ తనను వేశాలపల్లి ప్రజలు కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించి, భారీ మె జార్టీతో గెలిపిస్తామనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భూపాలపల్లి నగరపంచాయతీ కావడానికి జనాభా సరిపోకపోతే 2012లో వేశాలపల్లిని నగరపంచాయతీలో విలీనం చేస్తే కొంతమంది వ్యతిరేకించారన్నారు. పట్టణాలకు దీటు గా విలీన గ్రామాలను అభివృద్ధి చేస్తానని చెప్పి 2018లో గెలిచిన వెంటనే వేశాలపల్లి, జంగేడు, కాశీంపల్లి, పుల్లురి రామయ్యపల్లి, మహబూబ్ పల్లి గ్రామాలను సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో నాలుగు లేన్ల రోడ్లు వేసి అభివృద్ధి చేశానన్నారు.
భూపాలపల్లి పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమని, బీఆర్ఎస్ పాలనలో భూముల రేట్లు పెరిగి ఒక్క ఎకరం రూ.2కోట్లు ఉందన్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ సహకారంతో ఔటర్ రింగ్‌రోడ్డు తీసుకువచ్చామని, ఓఆర్ఆర్ ఏర్పాటుతో వీలీన గ్రామాల భూములకు రేట్లు ఆకాశానికి పెరుగుతాయన్నారు. వేశాలపల్లిలో అత్యధికంగా ఎస్టీ లు ఉన్న ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ వారి ని పట్టించుకోలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా 6శాతం ఉన్న రిజర్వేషన్లను సీఎం కేసీఆర్ 10శాతానికి పెం చాడన్నారు. ఐదేండ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి మ రోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. జిల్లాలకు మైనింగ్ ఇంజినీరింగ్ కళాశాల, 500 పడకల ఆసుపత్రిని తీసుకువస్తాని హామీ ఇచ్చారు. కొంతమంది కాంగ్రెస్ నా యకులు ఒక్కసారి అవకాశమివ్వండని జండూబామ్ పెట్టుకొని దొంగ ఏడుపు ఏడుస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఇంకా 100 డబుల్ బెడ్రూమ్లున్నాయని, వాటిని అర్హులకు అందజేస్తామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 15 జీపీలతో కలిపి గోరికొత్తపల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేశామన్నారు. ఎండ్ల తరబడి పెం డింగ్‌లో ఉన్న గోరిసాబ్ భూములకు పట్టాలు ఇప్పిచడంతో పాటు గోరికొత్తపల్లిలో సీసీ రోడ్లు, దళిత, బీసీలకు రూ.లక్ష, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిని వరంగల్‌కు దీటుగా అభివృద్ధి చేశాడన్నారు. డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు నిర్మించాడన్నారు. ఎవ రూ ఊహించని మెడికల్ కళాశాలను తీసుకొచ్చి భూపాలపల్లిలో వైద్య విద్య అందిస్తున్నారని తెలిపారు. భూపాలపల్లి మరింత వేగవంతంగా అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గండ్రను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
వేశాలపల్లికి చెందిన కాంగ్రెస్ ఎస్టీసెల్ అర్బన్ ఉపాధ్యక్షుడు నంగావత్ రాజేందర్‌తో పాటు 50మంది నాయకులు కౌన్సిలర్ రజితా జుమ్ములాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన 50మంది కాంగ్రెస్ నాయకులు, వైఎస్సార్టీపీ గణపురం మండల అధ్యక్షుడు సొక్కం సదయ్య, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ బీసీ సెల్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు చుక్క బాలరాజు సొంత గూటికి చేరుకున్నారు. టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి, పెద్దంపల్లి గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సుబ్బక్కపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఊరుగొండ సమ్మయ్య ఇటీవల కాంగ్రెస్‌లో చేరగా తిరిగిబీఆర్ఎస్లో చేరారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మామిడి తిరుపతి, కాటం తిరుపతిరెడ్డి ఆ గ్రామ నాయకులు 100 మందితో కలిసి, బీజేపి యూత్ నాయకులు రఘు, శివ తమ నాయకులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. పెద్దంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బోయిని అనిల్, రాజు, రవి, శాస్ర్తాల సమ్మయ్య, బోయిని రమేశ్, చిట్యాల పోశాలు, బోయిని సారంగం, రమేశ్, అనిల్ గులాబీ పార్టీకి జైకొట్టారు. వారందరికీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర యువ నాయకుడు గండ్ర గౌత్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్, 13వ వార్డు కౌన్సిలర్ మంగళపెల్లి తిరుపతి, ఎస్సీ సెల్ అర్బన్ అధ్యక్షుడు మోకిడి అశోక్, నాయకులు దుండ్ర కుమార్, జాగరి అజయ్, పోలవేణి ప్రసాద్, మోతె రాజు, టేకుమట్ల ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు సట్ల రవి, తిరుపతి, ఆది రఘు, గోరికొత్తపల్లి మండల అధ్యక్షుడు మటిక సంతోష్, జడ్పీటీసీ సాయిని విజయ, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్‌రావు, రేగొండ, గోరికోత్తపల్లి మండల ఎన్నికల ఇన్చార్జిలు సుజిత్‌రెడ్డి, అభిలాష్‌రెడ్డి, నాయకులు ఎంఏ హమీద్, పున్నం రవి, విద్యాసాగర్‌రెడ్డి, మైస భిక్షపతి, గంజి రజినీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

