వేలేరు, జూన్ 05 : వేలేరు మండలం సోడాషపల్లి గ్రామంలో జరుగుతున్న భూభారతి సదస్సును హనుమకొండ ఆర్డీవో రమేష్ రాథోడ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలపై ఆరా తీశారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను ప్రవేశపెట్టిందని అన్నారు. భూభారతి సదస్సుపై రైతులకు వివరించారు. భూ సంబంధిత సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కొమి, డీటీ వేణుగోపాల్, ఆర్‌ఎఐ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Ethanol Factory | ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకున్న 12 మంది రైతుల అరెస్ట్: ఎస్ఐ జగదీశ్వర్
Mahesh – Rajamouli | మహేష్ బాబు-రాజమౌళి మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్