Mahesh – Rajamouli | సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ నుండి ఏ అప్డేట్ బయటకు వచ్చిన అది క్షణాలలో వైరల్ అవుతుంది. ఇప్పటికే మూవీకి సంబంధించిన షెడ్యూల్ పూర్తి కాగా తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. కొత్త షెడ్యూల్ ఈ నెల 9 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు పలువురు నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు.
ఇక ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో జరిగిన సంగతి తెలిసిందే. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్ సీల్, బాల్డ ప్రాంతాల్లో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సీన్స్ చిత్రీకరించాడు దర్శకుడు రాజమౌళి. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం కొంత గ్యాప్ తీసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్‌కు రాజమౌళి జపాన్ వెళ్లగా.. మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం రోమ్ వెళ్లారు. ఇక ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లింది. ఇలా అందరు వేరు వేరు పనులతో బిజీగా ఉండడం వలన షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇక తిరిగి షూటింగ్ మొదలు పెట్టనున్నారు.
రాజమౌళి- మహేష్ బాబు మూవీలో కీలక రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్‌ను తీసుకోవాలని రాజమౌళి అనుకుంటున్నారట. ఇటీవల రాజమౌళి పూణే వెళ్లి స్క్రిప్ట్ వివరించగా, ఆయన పూర్తిగా విన్నారట. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ.20 కోట్ల వరకూ ఇస్తామని చెప్పినప్పటికీ నానా పటేకర్ ఈ ఆఫర్ తిరస్కరించారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. తన పాత్ర నచ్చకపోవడం వల్లనే నానా పటేకర్ సినిమా నుండి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ మూవీని కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో మూవీ రిలీజ్ కానుంది.