సందర్శకులను ఆకర్షించని భద్రకాళీ బండ్
భద్రకాళీ బండ్‌కు ఆహ్లాదం కరువైంది. సుందరీకరణ పేరుతో చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. సుమారు రూ.60 కోట్లు వెచ్చించినా ఇంకా అంధవికారంగానే ఉన్నది. భద్రకాళీ ఆలయానికి ఆనుకొని సుందరమై న చెరువు, పచ్చని ప్రకృతి, రబ్బరైజ్డ్ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలాలు ఏర్పాటు చేసినా ఇం కా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో సందర్శకులు సైతం అటువైపు రావడానికి వెనకడుగు వేస్తున్నారు.
- కోట్లు ఖర్చుచేసినా కానరాని సుందరీకరణ
- ఎండుతున్న చెట్లు.. కనిపించని పచ్చదనం
- లైట్లు వెలగక రాత్రివేళ అంధకారం
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
న్యూశాయంపేట, మే 15: భద్రకాళీ బండ్‌కు ఆహ్లాదం కరువైంది. సుందరీకరణ పేరుతో చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. సుమారు రూ.60 కోట్లు వెచ్చించినా ఇంకా అంధవికారంగానే ఉన్నది. భద్రకాళీ ఆలయానికి ఆనుకొని సుందరమై న చెరువు, పచ్చని ప్రకృతి, రబ్బరైజ్డ్ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలాలు ఏర్పాటు చేసినా ఇం కా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో సందర్శకులు సైతం అటువైపు రావడానికి వెనకడుగు వేస్తున్నారు. సాయంత్రం సమయంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ చూడడానికే తప్ప రాత్రివేళ అవి వెలగకపోవడంతో చీకటిమయంగా మారుతున్నది.
ప్రతిరోజూ ఏదో ఒక ఈవెంట్ ఉంటే నే సందర్శకులు రావడానికి ఇష్టపడతారు. కానీ, ఇక్కడ అలాంటివేమీ నిర్వహించడం లేదు. పర్యవేక్షణ కొరవడడంతో చెట్లు ఎండిపోతున్నాయి, పచ్చదనం కానరావడంలేదు. కోట్లు రూపాయలు ఖర్చుచేసినా పర్యాటకులు ఆకర్షించేలా ఒక్క పనీ లేదని పలువురు సందర్శకులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. పైసలు దోచుకోవడమే తప్ప భద్రకాళీ బండ్‌పై చేసిందేమీ లేదని మండిపడుతున్నారు. లోపలికి వెళ్లాలంటే టికెట్, పార్కింగ్, ఫొటోషూట్, బర్త్‌డే పార్టీలకు టికెట్లు కేటాయించి ఇలా సందర్శకుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయడం తప్ప ఆహ్లాదం కరువైందని వాపోతున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేని తనంతో భద్రకాళీ బండ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బయోడైవర్సిటీ పార్కు, రబ్బరైజ్డ్ వా కింగ్ ట్రాక్, ఇంటిగ్రేటెడ్ లైటింగ్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉన్నా సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులు రావడం లేదు. రాత్రివేళలో లైట్లు వెలగకపోవడతో ఈ ప్రాంతమంతా అంధకారం మారుతున్నది. కాకతీయుల కళా నైపుణ్యం ఉట్టిపడేలా చెకిన రాతిశిల్పాలు.. తోరణాలు, నడిచేందుకు వీలుగా సింథటిక్ ట్రా క్, వివిధ రకరకాల పూల మొకలు, ఆకట్టుకునే పొడవాటి షో చెట్లు నీళ్లు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. తీరొక రంగులు విరజిమ్మేలా ఏర్పాటు చేసిన నాలుగు ఫౌంటేన్లు పనిచేయడంలేదు.
అధికారుల పర్యవేక్షణ లేక..
అత్యాధునిక హంగులతో సరికొత్తగా రూపుదిద్దుకున్న భద్రకాళీ బండ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సందర్శకులను ఆకట్టుకోలేకపోతున్నది. లొకేషన్ అద్భుతంగా ఉండడంతో ఒకప్పు డు ఫొటోషూట్స్ తీసేందుకు యూత్ ఇష్టపడేవా రు.. కానీ, ఇప్పుడు వేసవి సెలవుల్లో అటువైపు రా వడానికే ఇష్టడడంలేదు. ఇప్పుడు బండ్‌పై అందమైన గ్రీనరీ, భద్రకాళీ కొండలు, ఆలయం, మధ్య న చెరువుతో అద్భుతంగా ఉండే ఈ ప్రాంతం ఇ ప్పుడు కళావిహీనంగా మారింది. సాయంసంధ్య లో ఇకడి అందాలు వీక్షించేందుకు వచ్చేవారికి లై ట్లు వెలగకపోవడంతో నిరాశ చెందుతన్నారు. కిలోమీటర్ మేర బండ్‌పై పొడువునా గార్డెనింగ్, పూలచెట్లు, ఈత చెట్లు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. మధ్యమధ్యలో ఉన్న ఓపెన్ జిమ్‌లు నిర్వహణ లోపంతో పాడైపోతున్నా యి. ఇప్పటికైనాఅధికారులు, ప్ర జాప్రతినిధులు చొరవచూపి త్వర గా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సందర్శకులు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

