ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపులను పైలట్ గ్రామంగా తీసుకోగా, 73 మందికి మంజూరు పత్రాలు అందించారు. ఇందులో 41 మంది లబ్ధిదారులు ముగ్గులు పోసుకోగా, 23 మంది బేస్మెంట్, మరికొందరు స్లాబ్ లెవల్ వరకు నిర్మించుకున్నారు. ముగ్గులు పోసే సమయంతో తీసిన లొకేషన్ ఆ తర్వాత నో లొకేషన్ అని చూపిస్తుండడంతో బిల్లులు రావడం లేదు. దీంతో మిగతా వారు ఇల్లు కట్టుకునేందుకు జంకుతున్నారు.
– నర్సింహులపేట, అక్టోబర్ 4
కొందరు బేస్మెంట్, మరికొందరు రూఫ్ లెవల్ పూర్తవుతున్నా ఇంత వరకు బిల్లులు రాలేదు. గుంతలు తీసిన కూలీల నుంచి ఇసుక పోసిన ట్రాక్టర్‌కు పైసలు ఇవ్వక పోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నాలుగో విడుతలో రూ. 5 లక్షల ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 73లో 41 మంది ముగ్గులు, 23 మంది పనులు ప్రారంభించారు. మిగిలిన 50 మంది లబ్ధిదారులు ఇండ్లు నిర్మాణం కోసం వెనుకడుగు వేస్తు న్నారని అధికారులు చెబుతున్నారు.
బిల్లుల కోసం ఎదురుచూపులు..
ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తుండగా, బేస్మెంట్ లెవల్‌కు రూ. లక్ష, స్లాబ్ పూర్తికాగానే రూ. లక్ష ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కొందరికే రూ. లక్ష వచ్చాయని, మిగిలిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో పనుల చేసేందుకు మందుకు రావడం లేదని వాపోతున్నా రు. రూఫ్ లెవల్, స్లాబ్ పూర్తయిన ఇండ్లకు డబ్బులు జమ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. లొకేషన్ చూ పించకపోవడంతో ఓ వ్యక్తి హైదరాబాద్ హౌసింగ్ ప్రధాన కార్యాలయం వెళ్లినా బిల్లు రాలేదని, ఇందిరమ్మ ఏఈ, డీఈలు సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునాదిలోనే మోడల్ ఇల్లు..
మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మా ణం చేసే ఇందిరమ్మ మోడల్ ఇల్లు పునాదిలోనే ఆగిపోయింది. హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌కు బిల్లు రాకపోవడంతో 7 నెలలైనా ముందుకు కదలడం లేదు. మోడల్ హౌస్‌కే మోక్షం లేకపోతే లబ్ధిదారులకు బిల్లులు ఎప్పుడొస్తాయోనని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.