BC Bandh | బచ్చన్నపేట, అక్టోబర్ 18 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని లక్ష్యంతో చేపట్టిన రాష్ట్ర బీసీ బంద్ శనివారం బచ్చన్నపేట మండలంలో విజయవంతమైంది. కాంగ్రెస్ బీ ఆర్ఎస్, బిజెపి, సిపిఐలతో పాటు పార్టీలు బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. ఈ సందర్భంగా వ్యాపార వాణిజ్య సంస్థలు, హోటల్లు స్వచ్ఛందంగా మూసి ఉంచారు. ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బీసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బంద్ విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు, వ్యాపార వాణిజ్య సంస్థలకు ఆయా పార్టీల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో నల్లగోని బాలకిషన్ గౌడ్, జంగేటి విద్యానాథ్, ముసిని రాజు గౌడ్, ఎండి మసూద్, గుర్రపు బాలరాజు, వడ్డేపల్లి మల్లారెడ్డి, కొండి వెంకటరెడ్డి, బొమ్మన ఆంజనేయులు గౌడ్, కైసర్, అల్వాల ఎల్లయ్య, నర్సింగారావు, దిద్దిగ రమేష్, జ్యోతి భాస్కర్, కర్ణాకర్ రెడ్డి, సిద్ధిరాం రెడ్డి, ప్రతాపరెడ్డి, రమేష్, రామకృష్ణ, మోహన్ రెడ్డి, అజీం, హరీష్, చెరుకూరు శ్రీనివాస్, ఆగయ్య, వేణుగోపాల్, దూడల కనకయ్య, జావీద్, సిద్ధులు, రాజు, రాజయ్య, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.