Bathukamma | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 23: టీజీవోస్ ఆధ్వర్యంలో ఈనెల 27న నాంపల్లి టీజీవో భవన్లో జరిగే బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గౌస్ హైదర్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో ఆయన టీజీవో జాతీయ మహిళా విభాగం ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌస్ హైదర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవో జాతీయ మహిళా విభాగం అడిషనల్ ఛైర్పర్సన్స్ కొత్త శ్రీప్రియ(అగ్రికల్చర్ ఆఫీసర్), పవిత్ర(ఏఈఈ, ఇరిగేషన్), టీజీవో జిల్లా వైస్ ప్రెసిడెంట్ మంజుల పాల్గొన్నారు.