వరంగల్ చౌరస్తా, జూన్ 16 : బ్యాంకులో పని చేస్తూ నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకున్న కేసులో సోమవారం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వరంగల్ ఇంతెజార్గంజ్ సీఐ షుకూర్ తెలిపారు.
ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో నిందితుల అరెస్ట్‌ను చూపిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఉద్యోగులతో పాటు ఖాతాదారులైన రాము శర్మ, పాసి జీవిత కుమార్, గౌరోజు బ్రహ్మచారి, పోలోజు రాజమౌళి నకిలీ బంగారంతో లోన్ తీసుకున్నారన్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు షుకూర్ తెలిపారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.