న్యూశాయంపేట, ఫిబ్రవరి 12 : శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ నగరానికి చెందిన ఆయన గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు.
2017లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021 నవంబర్లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండా ప్రకాశ్ విజయం సాధించారు. అనంతరం ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.