ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా బక్రీద్ పండుగ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల దగ్గర మత పెద్దలు బోధించే బోధనలను విన్నారు. తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు.
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల దగ్గర మత పెద్దలు బోధించే బోధనలను విన్నారు. తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పొట్టేళ్లను, మేకలను కుర్బానీ చేసి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
బక్రీద్ సందర్భంగా జిల్లాలోని ఈద్గాల దగ్గర సందడి నెలకొంది. గ్రేటర్ వరంగల్ (Warangal) నగరంలోని చింతల్ న్యూ ఈద్గాలో శనివారం ఉదయం ఈద్ నమాజును నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సమాజ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా ఈద్గాలో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. బక్రీద్ అనేది త్యాగానికి, సమాజ ఐక్యతకు ప్రతీక అన్నారు.
మానవత్వాన్ని, సహాయసహకారాన్ని నేర్పే పండుగ అని పేర్కొన్నారు. కుర్బానీ చేసి మాంసాన్ని బంధుమిత్రులతోపాటు పేదలతో పంచుకున్నారు. పండుగకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన బిర్యానీ, శీర్ ఖుర్మా, మటన్ కబాబ్లు ముస్లిం కుటుంబాల్లో ఉత్సాహం నింపాయి. కార్యక్రమంలో చింతల్ న్యూ ఈద్గా అధ్యక్షుడు ఎండీ షర్పోద్దిన్, రహమతుల్లా షరీఫ్, వక్త సుభాన్, అబ్దుల్ బారి, సిరాజోద్దీన్, ఎంఎస్ సలీం సమియోద్దీన్ తజముల్, రహమతుల్లా ఖాన్, అక్రమ్, ఎస్కే అజీమ్, అంజద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో..
జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో జరిగిన బక్రీద్ వేడుకల్లో దస్తగిరి, షబ్బీర్, అజీమ్, గౌస్, బషీర్, జావీద్, మొహమ్మద్ యూసుఫ్, మహబూబ్ అలీ, అయుఖాన్, జహంగీర్, సయ్యద్ సాబ్, షాదుల్లా, అజ్జు, బాబులు, అఫ్రోజ్, నాయకులు అరవిందరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, జితేందర్ రెడ్డి, హరి ప్రసాద్, గాలి కృష్ణ, రమేష్, నర్రా దామోదర్ రెడ్డి, తోట్ల కృష్ణ, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

