ములుగు జీజీహెచ్‌లో అడ్డదారిన ఉద్యోగాలు
ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో దొడ్డి దారిన హౌస్ కీపింగ్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు తమ ప్రయత్నాలను ము మ్మరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ అనుబంధ వవాఖానగా ఏర్పడిన ములుగు జీజీహెచ్‌కు రోజు రోజు కూ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వారికి సేవలందించేందుకు తగిన సిబ్బందిని నియమించాల్సి ఉంది.
- హౌస్ కీపింగ్ పోస్టులకు రూ.లక్షల వసూళ్లు
- దళారుల దందాతో అనర్హులకు ఉద్యోగాలు
ములుగు, జూలై 3 (నమస్తే తెలంగాణ): ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో దొడ్డి దారిన హౌస్ కీపింగ్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు తమ ప్రయత్నాలను ము మ్మరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ అనుబంధ వవాఖానగా ఏర్పడిన ములుగు జీజీహెచ్‌కు రోజు రోజు కూ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వారికి సేవలందించేందుకు తగిన సిబ్బందిని నియమించాల్సి ఉంది. దీంతో ఇటీవల ఉన్నతాధికారుల అనుమతుల తో ఔట్ సోర్సింగ్ విధానంలో 60 హౌస్ కీపింగ్ పో స్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు.
గతంలో ములుగు ప్రభుత్వ దవాఖానలో హౌస్ కీపింగ్ పనులను హనుమకొండకు చెందిన ఓ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నియమించిన ఉద్యోగుల ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రస్తు తం జీజీహెచ్‌గా మారిన తర్వాత అదే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి మరో 60 మంది హౌస్ కీపింగ్ సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. సానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ విభాగాల్లో అర్హులైన అభ్యర్థులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. అయితే దీనిని ఆసరాగా తీసుకున్న కొం దరు దళారులు ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షలు వసూలు చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామం టూ నమ్మబలుకున్నట్లు సమాచారం. వారి మాయ మాటలను నమ్మిన నిరుద్యోగులు అప్పులు చేసి మరీ డబ్బులను ముట్టచెబుతున్నారనే చర్చ ములుగులో జోరందుకుంది.
అర్హత లేని వారితో మెరుగైన సేవలు అందేనా?
ములుగు ప్రభుత్వ దవాఖాన 2024లో జీజీహెచ్‌గా ఏర్పడినప్పటి నుంచి అన్ని ఉద్యోగాల భర్తీలో రాజకీయ ప్రమేయంతో పాటు దళారుల ప్రవేశంతో అర్హత లేని వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో దవాఖానకు వచ్చే రోగులకు అనుకున్న మేరకు సేవలందడం లేదు. 2024 నవంబర్‌లో ములుగు నర్సింగ్ కాలేజీలో చేపట్టిన ఉద్యోగాల భర్తీలో ఇదే రీతిలో వ్యవహరించడంతో అప్పటి కలెక్టర్ జోక్యంతో కొద్ది రోజులు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేసి తిరిగి గుట్టు చప్పుడు కాకుండా భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం చేపట్టిన హౌస్ కీపింగ్ ఉద్యోగాల్లో సానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ విభాగాల్లో పనిచేసేందుకు నిబంధనల ప్రకారం కొన్ని అర్హతలు ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది.
సానిటేషన్, సెక్యూరిటీ విభాగంలో పనిచేసేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన సెక్యూరిటీ సంస్థ నుంచి శిక్షణ పొందిన సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. అలాగే పేషంట్ కేర్ విభాగంలో పనిచేసేందుకు ప్రథమ చికిత్సలో శిక్షణ పొందినట్లుగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. అయితే వీటన్నింటిని బేఖాతరు చేస్తూ దళారులు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని డబ్బులు దండుకుంటుండంతో నిరుద్యోగులు లబోదిబోముంటున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి పోస్టుల భర్తీ ప్రక్రియపై విచారణ జరిపి అర్హులైన వారికే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

