బచ్చన్నపేట ఏప్రిల్ 05 : అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రాం పలువురు వక్తలు అన్నారు. శనివారం బచ్చన్నపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ జగ్జీవన్ రాం విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు కంత్రి సత్తయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన దేశానికి చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పైసా రాజశేఖర్ మాదిగ, అల్వాల నర్సింగరావు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్వాల రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి నల్లగొని బాలకిషన్ గౌడ్, అల్వాల ఎల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు, వడ్డేపల్లి మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్రం బాలరాజ్, జిల్లా రాజేశ్వర్, టిడిపి రాష్ట్ర నాయకులు అల్లాదుర్గం వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్వాల్ రమేష్, కోడూరు మహాత్మ చారి, కిసాన్ సెన్ జిల్లా నాయకులు నారాయణరెడ్డి, బుడగ జంగాల మండల అధ్యక్షులు సిరిపాటి రామదాసు, కాంగ్రెస్ పార్టీ టౌన్ ఉపాధ్యక్షులు గందమల్ల కిష్టయ్య, బీఎన్ ఆర్ కే ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మగళ్ల కృష్ణ, వీహెచ్ఎస్ మండల నాయకులు అల్వాల స్వామి, రజక సంఘం నాయకులు దేవరకొండ బిక్షపతి, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు అల్వాల విజయ్ కుమార్, కర్రె శ్రీనివాస్, తమ్ముడి మహేందర్, మహమ్మద్ యూసుఫ్, అల్వాల పవన్, భాస్కర్,భరత్, కొల్లూరు రామచంద్రం, పైసా కిష్టయ్య, పర్వతాలు, బాండ్లపల్లి బబ్బులు, గందమల్ల మల్లేష్, మొద్దు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.