Warangal | హనుమకొండ, ఏప్రిల్ 12 : ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలోని త్రిచక్ర పొదుపు, పరపతి పరస్పర సహకార సంఘం బాధ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభకు లక్షా నూట పదహారు రూపాయల విరాళాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌కు శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాయలంలో జరిగిన సన్నాహక సమావేశంలో అందజేశారు. అంతేకాకుండా 800 ఆటోలు సభ రోజున స్వచ్ఛందంగా రావడం కాకుండా ప్రజలను తరలిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా త్రిచక్ర పొదుపు , పరపతి పరస్పర సహకార సంఘం అధ్యక్షులు ఇసంపల్లి సంజీవ మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో ఆటో కార్మికులు ఈ 15 నెలల్లో ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. కేసీఆర్ హయాంలో ఆటో కార్మికులకు ఎంతో అండగా నిలిచారని, రోడ్ టాక్స్ మాఫీ చేశారని అన్నారు. హనుమకొండ జిల్లాలో ఆటో కార్మికులకు బీమా వసతి కల్పించిన ఘనత దాస్యం వినయ్ భాస్కర్‌కు దక్కుతుందని తెలిపారు. త్రిచక్ర సంఘానికి సైతం వినయ్ భాస్కర్ రూ. 30 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. వినయ్ భాస్కర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఆటో కార్మికులు ఎల్లవేళలా అండగా, రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, త్రి చక్ర సభ్యులు మంద శ్రీధర్ రెడ్డి, చీకటి కుమార్, మండికొండ బాబు, కలకోట్ల జయరాం, స్వామి, సంజీవ, బాబు, వెంకటేశ్వర్లు, రమేష్ పాల్గొన్నారు.