Telangana newsనర్మెట, జూన్ 3 : అమ్మమ్మ ఇంటికి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన సంఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్మెట ఎస్ఐ నైనాల నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజుల క్రితం ఓ బాలిక అమ్మమ్మ ఇంటికి వచ్చి ఇంట్లో నిద్రిస్తుంది.
నర్మెటకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి బెడ్‌పై నిద్రిస్తున్న సదరు బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, ఆత్యాచారయత్నానికి ప్రయత్నించగా అమ్మాయి గట్టిగా అరిచి ప్రతిఘటించింది. ముందు గదిలో నిద్రిస్తున్న బాలిక అమ్మమ్మ నిద్రలేచి రావడంతో సదరు వ్యక్తి ఇంట్లో నుండి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ నాగేష్ తెలిపారు.