వరంగల్ చౌరస్తా: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సవ్యాసమాజం తలదించుకునేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ కి చెందిన రంజాన్ అనే యువకుడు కూలీ పని చేసుకుంటూ గత కొంతకాలంగా ఇంతేజార్గంజ్ ప్రాంతంలో నివసముంటూ జీవనం సాగిస్తున్నాడు.
బుధవారం రాత్రి మూడేళ్ల వయసున్న పక్కింటి బాలికపై అత్యాచారయత్నం చేయడంతో బాలిక కేకలు వేసింది. దాంతో చుట్టుపక్కల వారు మేలుకొని నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబసభ్యులకు ఇచ్చిన పిర్యాదు ఆధారంగా నిందితుడిపై ఫోక్స్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇంతేజార్గంజ్ఇన్స్పెకర్టర్ షుఖుర్ తెలిపారు.