ఎం డలో పైలం..
వడదెబ్బ తగిలినప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో తగిన చికిత్స పొందాలి. దవాఖానకు తరలించే క్రమంలో ముందుజాగ్రత్తగా తగిన ప్రాథమిక చికిత్స అందించేందుకు కృషి చేయాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి.
- కొద్దిరోజుల నుంచి పెరుగుతున్న వేడి
- గరిష్ఠ ఉష్ణోడ్రతతతో డీహైడ్రేషన్ ముప్పు
- వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి
- సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి
- వైద్యుల సలహాలతో రక్షణ పొందాలి
సూర్యుడు మన నెత్తి మీదే ఉన్నాడా అన్నట్లు వారం పది రోజుల నుంచి ఎండలు భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 46 డిగ్రీలు దాటి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 7నుంచే ‘అగ్ని పరీక్ష’ మొదలవుతుండగా వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీటి శాతం తక్కువై డీహైడ్రేషన్తో పాటు వడదెబ్బ తగిలే ప్రమాదముంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్స తీసుకొని ప్రాణాలు కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
– ములుగు, మే 21 (నమస్తే తెలంగాణ)
వడదెబ్బ తగిలితే..
వడదెబ్బ తగిలినప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో తగిన చికిత్స పొందాలి. దవాఖానకు తరలించే క్రమంలో ముందుజాగ్రత్తగా తగిన ప్రాథమిక చికిత్స అందించేందుకు కృషి చేయాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. ఆ తర్వాత చల్లని నీటిలో ముంచిన తడి గుడ్డతో శరీరం మొత్తం తుడవాలి. శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే వరకు అలాగే అనుసరించాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి వడదెబ్బకు గురైన వ్యక్తికి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్రావణం, లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్)ను తాగించాలి. కొన్ని పరిస్థితుల్లో వడదెబ్బ తగిలిన వ్యక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్తే వారికి నీరు తాగించవద్దు. వీలైనంత వరకు త్వరగా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాలి. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తగిన చికిత్స అందిస్తే వడదెబ్బ నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది.

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- అధిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఆహార అలవాట్లను మార్చుకోవాలి.
- చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ వైద్యుల సలహాలు తీసుకోవాలి.
- ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగొద్దు.
- వేసవిలో మద్యం తాగడం మానేయాలి.
- రోడ్ల మీద, చిన్న చిన్న హోటళ్ల వద్ద రంగులు కలిపిన, ఐస్ కలిపిన చల్లని పానీయాలు తీసుకోవద్దు.
- కలుషిత ఆహారంతోపాటు అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన పదార్థాలు తినకూడదు.
- మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు, పాలు, మజ్జిగ, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి.
- పరిశుభ్రమైన వాతావరణంతోపాటు గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి.
- ఉదయం, సాయంత్రం రెండు పూటల తప్పనిసరిగా స్నానం చేయాలి.
- నీటిని ఎక్కువగా తాగడంతో పాటు పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగాలి.
- ఉదయం నుంచి సాయంత్రం వరకు 15గ్లాస్ల నీళ్లు తాగాలి.
- ఉతికిన బట్టలు ధరించాలి. అందులో లేత వర్ణం, తేలికైన కాటన్ దస్తులు ధరించాలి.
- ఎండలో ఇంటి పట్టున ఉండేందుకు ప్రయత్నించాలి.
- బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపి వంటి వాటిని వెంట తీసుకెళ్లాలి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

