సుబేదారి, మే 29 : ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల అరెస్టు వివరాలను పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి వెల్లడించారు. ప్రధాన బుకీ వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన కీర్తి య శ్వంత్, అదేగ్రామానికి చెందిన పాలకుర్తి మహేశ్, పురమాని పవన్, పాలకుర్తి సురేశ్‌గౌడ్, వర్ధన్నపేటకు చెందిన అన్నమనేని శ్రావణ్, కలిసి యాప్ ద్వారా ఆన్లైన్ క్రికె ట్ బెట్టింగ్ మోసాలకు పాల్పడుతున్నారు.
వర్ధన్నపేట, మామునూరు సమీప గ్రామాలకు చెందిన యువకులను ఆన్లైన్ బెట్టింగ్‌లో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్త్తూ, గూ గుల్పే, ఫోన్ పే ద్వారా లావాదేవీలు నడిపించేవారు. బెట్టింగ్‌లో పాల్గొన్నవారు అ నుకున్న మ్యాచ్ గెలిస్తే రెండింతలు డబ్బులు ఇస్తామని ప్రధాన బుకీ యశ్వంత్ న మ్మించేవాడు. బెట్టింగ్ యాప్ సంస్థకు 5 శాతం కమీషన్ చెల్లించేవారు. ఏడాది కా లంగా రహస్యంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా నడుపుతున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో నిఘా పెట్టి మామునూరు ప్రాంతంలో బెట్టింగ్ పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10.30 లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులో ప్రతిభ చాటిన టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, సీఐ సంతోష్, ఎస్సై లవన్‌కుమార్, మామునూరు ఎస్సై రాజేశ్‌ను సీపీ అభినందించారు.