నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 15: ఉమ్మడి జిల్లాలో కొలువుదీరిన గణనాథులు తొమ్మిదిరోజులపాటు పూజలందుకుని నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆరు జిల్లాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నిమజ్జనానికి వెళ్లే రహదారుల మరమ్మతులతోపాటు విద్యుత్ లైట్లు, బారికేడ్లు, ప్రతి చెరువు వద్ద క్రేన్లతోపాటు తెప్పలు అందుబాటులో ఉంచారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పారిశుధ్య సేవలు అందించేందు కు ప్రత్యేకంగా కార్మికులను నియమించారు.
హనుమకొండ ప్రాంతంలో 14 , వరంగల్‌లో 7 చెరువుల వద్ద 28 క్రేన్లను ఏర్పాటు చేశారు. వరంగల్ కోట చెరువులో నిమజ్జనం నిషేధించా రు. నిమజ్జన చెరువుల వద్ద ఏర్పాట్లను మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, సిటీ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాతోపాటు ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు గణనాథులను కాళేశ్వరం వద్దే నిమజ్జనం చేస్తారు.
కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పీ కిరణ్‌ఖరే గోదావరి వద్ద గజ ఈతగాళ్లను, తగు పరికరాలను సిద్ధం చేశారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉం చారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్ల చెరువును ఇప్పటికే కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా, సీపీ అంబర్ కిశోర్ ఝా, వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌లోని నిజాం చెరు వు వద్ద సర్వసిద్ధం చేశామని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం నిజాం చెరువు వద్ద నిమజ్జ న ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రాంనాథ్‌తో కలిసి పరిశీలించారు.