హనుమకొండ చౌరస్తా, మే 15 : 2025-26 విద్యాసంవత్సరానికిగాను హనుమకొండ జిల్లాలోని కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివి, 10వ తరగతిలో 7.0 జీపీఏ ఆపై ఫలితాలు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఏ.శ్రీలత తెలిపారు.
కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఎసెస్సీ మార్కుల మెమో, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, వికలాంగ ధృవీకరణ పత్రం, స్టడీ సర్టికెట్లు(4 నుంచి 10 వరకు), హాస్టల్ బోనఫైడ్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో ఈనెల 31లోగా www.telanganaepass.cgg.gov.in లోదరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.