హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు, ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. సమ్మేటివ్-2 పరీక్షలు సైతం ఏప్రిల్ 20 నుంచే ప్రారంభంకానున్నాయి. దీంతో ఇబ్బందులు వస్తాయని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తంచేసింది. పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని అసోసియేషన్ నేతలు పీ రాజభాను చంద్రప్రకాశ్, జీ హేమచంద్రుడు, పీ మురళీకృష్ణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అభ్యర్థుల జాబితా విడుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రి క్రూట్మెంట్ బోర్డు బుధవారం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ నెల 28వ తేదీలోగా తెలియజేయాలని సూచించింది.
వెబ్సైట్లో ఎఫ్ఎస్ఎల్ పరీక్ష హాల్‌టికెట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటు లో ఉంచినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఎదురైతే 93910 05006 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది.