Tribal Welfare | ములుగు : ములుగు జిల్లాలోని జాకారం గ్రామం నందు గల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల మినీ గురుకులంలో 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశం పొందడానికి ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్థినులు దరఖాస్తుతో పాటు పేరెంట్స్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లతో నేటి నుండి జూన్ 6వ తేదీ లోగా జాకారం మినీ గురుకులంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాకారం మినీ గురుకులం ప్రిన్సిపాల్ ఎం అనిత ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒకటవ తరగతిలో 30 సీట్లు, రెండవ తరగతిలో 12, మూడో తరగతిలో ఐదు సీట్లు భర్తీ చేయనున్నామని ఈ ప్రకటన ద్వారా తెలిపారు.