బచ్చన్నపేట సెప్టెంబర్ 5 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంతో పాటు ఆలింపూర్, కొన్నె, పోచన్నపేట తదితర గ్రామాల్లో శుక్రవారం ఘనంగా అన్నదానం నిర్వహించారు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపయ్య మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలింపూర్లో బొడ్రాయి వద్ద రెడ్డి స్ట్రీట్లో వినాయక యూత్ ఆధ్వర్యంలో, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏకదంతాయ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆయా సంఘాల బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం దాతలను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండపాల వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.