జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలను పడక్బందీగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శు క్రవారం అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లల ఆరో గ్యం, పోషణ వివరాలు, భోజనం, విద్యా బోధనలు వంటి పలు అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 644 అంగన్వాడీ కేంద్రాలను ప్రతి నెలా తనిఖీ చేసి వాటి పనితీరు, వివరాలను నిర్దేశించిన నమూనాలో నమోదు చేయాలన్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వారి ఎదుగుదల, ఆహారం, నాణ్యతా ప్రమాణాలు, పరిశు భ్రత మొదలగు విషయాలు తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా చర్య లు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 5 కోట్లు మంజూరు చేసిందని, అవసరమైన అదనపు నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొ న్నారు. వీటిని వంద శాతం సద్వినియోగం చేస్తూ మెరుగైన సేవలు అందించాలని, పిల్లల పోషణపై అప్ర మత్తంగా ఉండాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో గతంలో ఖాళీగా ఉన్న 145 అంగన్వాడీ టీచర్లను పూర్తి పారదర్శకంగా నియా మకం చేశామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను సైతం అదేవిధంగా ఎంపిక చేయాలని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ క్లస్టర్ వారీగా అంగన్వాడీ కేంద్రాల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో డీడబ్ల్యూవో శామ్యూల్, సీడీపీవోలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.