ఐనవోలు(హనుమకొండ) : కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక, డైవర్షన్ రాజకీయాలు ( Diversion Politics) చేస్తున్నారని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చంద్రారావు ( Chandra Rao ) , మండల కన్వీనర్ తంపుల మోహన్ మండిపడ్డారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ టాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ నోటీస్ విచారణను నిరసిస్తూ మండల కేంద్రంలో రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని నిరసన తెలియజేస్తున్న నాయకులు, పార్టీ శ్రేణులను ఎస్సై పస్తం శ్రీనివాస్ బలవంతంగా పక్కకు పంపించారు.
సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేతులో ఉంది కదా అని అధికార దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఆరోపించారు. రాష్ట్రంలో ఆరాచక, అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రఘువంశీ, సర్పంచులు అశోక్ రావు, ఉస్మాన్అలీ, ఏలియా, మాజీ సర్పంచులు దేవేందర్, శ్రీనివాస్ రావు, ఎంపీటీసీలు రాజు, గణేశ్, మాజీ ఉప ఎల్లగౌడ్, సర్పంచ్ సతీశ్, ప్రకాశ్, నాయకులు రవికుమార్, అశోక్, తిరుపతి, నరేశ్, చందు, రాజు తదితరులు పాల్గొన్నారు.