రాజ్యాంగ నిర్మాతకు నందనవన నివాళి
తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం పరిపాటి అయ్యింది. అంబేద్కర్ స్ఫూరితో తెలంగాణను సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఓరుగల్లు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
- ఓరుగల్లులో సర్వాంగ సుందరంగా ‘అంబేద్కర్’ జంక్షన్
- నాడు వెలవెలబోయిన ప్రాంతం..
- నేడు పచ్చల హారం.. ఫౌంటెయిన్లతో కనువిందు
నాడు..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట హనుమకొండలో ఉన్న ముఖ్య కూడలి, తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ఇలా వెలవెలబోయి ఉండేది..
నేడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ప్రగతి బాట పట్టిన ఓరుగల్లు నగరంలో ‘అంబేద్కర్ జంక్షన్’ను ఇలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. అంబేద్కర్‌పై గౌరవంతో జంక్షన్‌ను ఆకట్టుకునేలా అభివృద్ధి చేసింది.
వరంగల్, ఏప్రిల్ 13 : తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం పరిపాటి అయ్యింది. అంబేద్కర్ స్ఫూరితో తెలంగాణను సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఓరుగల్లు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
అంబేద్కర్‌పై గౌరవంతో ఈ జంక్షన్‌ను రూ.1.50కోట్లతో అభివృద్ధి చేశారు. చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్ చొరవతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. రాజ్యాంగ గ్రంథం, శక్తివంతమైన పెన్ను, మధ్యలో భారీ అశోక చక్రం నమూనాలను ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంతంలో గ్రీనరీని అభివృద్ధి చేశారు. ఆకట్టుకునే వాటర్ఫౌంటెయిన్లు, రాత్రుళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ఇప్పుడు అంబేదర్ జంక్షన్ ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. ఆయన జయంతి సందర్భంగా ఈ సరికొత్త ‘నందనవనం’ ఘన నివాళులర్పిస్తున్నది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

