కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాత్యులు చెప్పినా పనులకు అతీగతీలేదు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా చెప్పుకుంటున్న సీతక్క ములుగు జిల్లాలో సర్కిల్ ఆఫీసు ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనను నార్త ర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్) పూర్తిగా పక్కనబె ట్టింది. మేడారం జాతరకు ముందే ప్రతిపాదనలను పంపడంతో పాటు పలుమార్లు సంస్థ అధికారులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ పెద్దగా పట్టించుకోవడంలేదు. 2026లో జరిగే మేడారం జాతర వరకైనా ములుగు జిల్లాలో ఎన్పీడీసీఎల్ సర్కిల్ ఏర్పాటయ్యేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
– వరంగల్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ప్రజల కేంద్రంగా పరిపాలన అందించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్ర భుత్వం 2016 అక్టోబర్లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఆ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలు దీనికి అనుగుణంగా మార్పులు చేశాయి. టీజీఎన్పీడీసీఎల్ సైతం గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలో మాత్రమే ఉండే సర్కిల్ వ్యవస్థను కొత్త జిల్లాల్లోనూ ఏర్పాటు చేసింది. స్థానికంగానే పర్యవేక్షణ ఉండడంతో కరెంటు సరఫరా వ్యవస్థ మెరుగుపడింది. అనంతరం కేసీఆర్ 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు.
అప్పటి వరకు భూపాలపల్లి జిల్లాలో భాగంగా ఉన్న ములుగు జిల్లా ప్రాంతానికి ప్రత్యేకంగా సర్కిల్ ఆఫీసు ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీస ప్రతిపాదనలూ పంపలేదు. ఆదివాసీ ప్రాంతం కావడం, మేడారం జాతర ప్రదేశం ఉండడంతో ములుగు జిల్లాకు ప్రత్యేకంగా సర్కిల్ ఆఫీసు ఉండాలని ప్రజలు, రైతుల నుంచి డిమాండ్ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీతక్క దీనిపై టీజీఎన్పీడీసీఎల్కు ప్రతిపాదనలు పంపగా పక్కనబెట్టింది.
నార్తర్న్ పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్) పరిధిలో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచి ర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిలాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో కరెంటు సరఫరా కోసం ప్రత్యేకంగా సహకార పంపిణి వ్యవస్థ ఉన్నది. ములుగు జిల్లాలో మిన హా అంతటా ప్రత్యేకంగా సర్కిల్ ఆఫీసులు ఉన్నాయి. సీతక్క ప్రస్తుతం ములు గు ఎమ్మెల్యేగా, రాష్ట్ర క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్నారు. ఈ జిల్లాలో సర్కిల్ ఆఫీ సు అంశం ఏర్పాటుపై టీజీఎన్పీడీసీఎల్ పట్టించుకోవడంలేదు.