హనుమకొండ చౌరస్తా, జూన్ 23 : ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దిన్సోతవాన్ని నిర్వహిస్తామని, ఆ రోజున అమరుల సేవలను కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులను సతరించి కృతజ్ఞతలు తెలుపుతామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ విధినిర్వహణలో అసువులు బాసిన ఉద్యోగుల స్మృత్యర్థం హనుమకొండలో ఏర్పాటు చేసిన స్తూపాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే సంకల్పంతో విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పుతున్న వారి జ్ఞాపకార్థం 16 సరిళ్ల పరిధిలో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నామని, ముందుగా హనుమకొండ సరిల్ పరిధిలో ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి గ్రాట్యుటీ, వెల్ఫేర్ ఫండ్ తదితర ప్రయోజనాల ఫైల్ ప్రక్రియను ప్రారంభించిన తేదీ నుంచి 45 రోజుల్లోపు పూర్తిచేసి తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు.
ఆలస్యం కాకుండా సత్వర చర్యలు చేపట్టి వారి కుటుంబానికి అండగా నిలవాలని సీఎండీ సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డైరెక్టర్లు బీ అశోక్‌కుమార్, టీ సదర్లాల్, టీ మధుసూదన్, వీ తిరుపతిరెడ్డి, సీఈలు కే తిరుమల్‌రావు, రాజుహన్, రవీంద్రనాథ్, హనుమకొండ ఎస్ఈ పీ మధుసూదన్‌రావు, వరంగల్ ఎస్ఈ పీకే గౌతమ్‌రెడ్డి, డీఈలు ఏ విజేందర్‌రెడ్డి, సాంబరెడ్డి, సామ్యానాయక్, దర్శన్‌కుమార్, బేతి భిక్షపతి, ఆనందం, హర్జి, ఎస్ఏ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.