ఆలస్యంగా వచ్చినా తొలకరి వానలు రోజూ పడుతున్నాయి. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని రైతులు వానలకు ముందే పంటలు సాగు చేశారు. దుక్కులు తడిపి పత్తి విత్తనాలు పెట్టారు. తొలకరి వానలతో ఇప్పుడు ఈ పంటలు బాగున్నాయి. రైతులు గుంటుకలతో కలుపు తీసేస్తున్నారు. వరి పంట ఈసారి జోరుగా సాగనున్నది. అందరు రైతులు ఇప్పటికే నార్లు పోసుకున్నారు. వానలతో దుక్కులు దున్నేందుకు సిద్ధమవుతున్నారు. వానలకు తోడు బోర్లు, బావుల్లోని నీళ్లతో నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండురోజులుగా రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
– స్టాప్ ఫొటోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్ వరంగల్