హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ కేసు వ్యవహారంలో కేటీఆర్‌ను ఉద్దేశించి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. మీడియాలో కవరేజ్ కోసమే అడ్డగోలుగా మాట్లాడారని ఆదివారం ప్రకటనలో ఎద్దేవా చేశారు. వెంటనే కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
డ్రగ్స్‌పై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం మోపిందని గుర్తుచేశారు. ఆధారాలులేకున్నా మొయినాబాద్ డ్రగ్స్ కేసును కేటీఆర్‌కు అంటగట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. నిత్యం ప్రజాసమస్యలపై నిలదీస్తున్న కేటీఆర్‌ను నిలువరించేందుకే కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధంకావాలని సవాల్ విసిరారు. లేదంటే తోకముడుచుకొని కూర్చోవాలని హితవు పలికారు.