నాంపల్లి మార్చి 15 : ఇటుక లారీ ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికిక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లి మండల పరిధిలోని రేఖ్యాతండా పంచాయతీ పరిధిలోని వస్రాం తండా వద్ద మాచర్ల నుంచి ఇటుక లోడుతో వస్తున్న ఏపీ29యు7795 నంబరు గల లారీ హైదరాబాద్‌కు వెళ్తోంది. అదే సమయంలో మల్లేపల్లి నుంచి ఏపీ 24టీసీ 5299 నంబరు గల ప్యాసింజర్ ఆటో చింతపల్లికి వెళ్తుండగా వస్రాం తండా వద్ద ఇటుక లారీ ఆటోను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో కొర్రమాన్సింగ్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కొర్ర బద్యా, ఆటోలో ప్రయాణిస్తున్న బీహర్‌కు చెందిన సంతోష్ కలీఫా, ఏపీకి చెందిన బం డారు ఇస్సాక్ అక్కడికక్కడే మృతి చేందారు.
ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో 12 మంది ప్రయాణికులు ఉ న్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. మృతులను దేవరకొండ ఏరియా దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తున్నట్లు నాంపల్లి సీఐ రాజు, ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.