ప్రకృతి రమణీయతతో సిరులు కురిపించే పాడిపంటల నెలవు పాలకుర్తి నియోజకవర్గం. ఘనమైన త్రిలింగ, తెలంగాణ సారస్వత, చారిత్రక వారసత్వానికి ప్రతీక. పామర భాషకు ఆద్యుడు ఆదికవి పాల్కురికి సోమనాథుడు, సహజకవి బమ్మెర పోతనామాత్యుడు, వల్మీడి నేలపై నడయాడిన రామాయణ కావ్యకవి వాల్మీకికి నెలవైన నేల పాలకుర్తి.
తొర్రూరు, మార్చి 17 : నాటి వలస పాలనలో ఉమ్మడి వ రంగల్ జిల్లాలో అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచి నేడు సీఎం కేసీఆర్ ప్రగతి పాలనలో జనం మెచ్చిన నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సారధ్యంలో ప్రగతికి కేరాఫ్‌గా పాలకుర్తి నియోజకవర్గం ఆదర్శమైన అభివృద్దిని సాధిస్తోంది. జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఆరు మండలాలుగా విస్తరించిన ని యోజకవర్గం ప్రభుత్వ పరంగా సాగుతున్న సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి పనులు ఇక్కడి జనం గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.
స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ది సేవకుడు కేసీఆర్ వజ్ర సంకల్పంతో, యువనేత మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. 1994లో ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు నేటివరకూ ఓటమి ఎరగని నేతగా విజయం సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో పలు కీల క శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశం మెచ్చిన పంచాయతీరాజ్ మంత్రిగా గుర్తింపు సాధించి కేంద్రం ప్రకటించిన అనేక అవార్డులకు ఆయన పని తీరుకు కొలమానంగా నిలువడంతో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. వందల కోట్ల నిధులతో పాలకుర్తి నియోజకవర్గం ఎనిమిదేళ్లలో నూతన రూపురేఖలను సంతరించుకుంది.
వేగంగా రిజర్వాయర్ల నిర్మాణం
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలకుర్తి రిజర్వాయర్‌కు రూ.63 కోట్లు మంజూరు చేశారు. 0.25 టీఎంసీ సా మర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ద్వారా 7500ఎకరాలకు సాగు నీరు అందనుంది. చెన్నూరు రిజర్వాయర్‌కు రూ.100 కోట్లు మంజూరు చేశారు. 0.58 టీఎంసీల సామర్థ్యంతో 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో రిజర్వాయర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. కాల్వ తవ్వకపు పనులు కొనసాగుతున్నాయి.
తొర్రూరులో సమీకృత మార్కెట్‌ను ప్రారంభించిన అనంతరం కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతున్న మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు(ఫైల్)
మండల కేంద్రాల అభివృద్ధి
నియోజకవర్గంలోని ఆరుమండల కేంద్రాలను అభివృద్ధి చేశారు. ఒక్కో మండల కేంద్రానికి సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. జంక్షన్లు, రోడ్లవిస్తరణ, సెంట్రల్‌లైటింగ్, సీసీ రోడ్లు, డివైడర్లు, డ్రైనేజీల నిర్మాణం, పాలకుర్తిలో రాజీవ్ చౌరస్తా విస్తరణ, రాయపర్తిలో బస్టాండ్ సెంటర్ ఆధునీకరణ, దేవరుప్పులలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ల విస్తరణ, కొడకండ్లలో రోడ్ల విస్తరణ తీరును చూస్తే అభివృద్ధి కళ్లకు కడుతోంది.
కుట్టు శిక్షణతో ఉపాధి…
రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మూడు దశల్లో 10 వేల మంది స్వయం సహాయక సం ఘాల మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని రూ.5 కోట్ల10లక్షలతో చేపట్టారు. మొదటి విడుతలో శిక్షణ పొందిన మూడు వేల మందికి కుట్టుమిషన్ల ప్రక్రియను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇటీవల ప్రారంభించారు.
ఉపాధిహామీ నిధులతో అభివృద్ధి..
ఉపాధి హామీ పథకం ద్వారా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 177 గ్రామాల్లో రూ. 20 కోట్ల 3 లక్షల నిధులు వెచ్చించి వైకుంఠధామాలు, రూ.4 కోట్ల 78 లక్షలు ఖర్చు చేసి డంపింగ్ యార్డులు, రూ.4 కోట్ల 11 లక్షలతో 19 బృహత్ పల్లె ప్రకృతి వనాలు నిర్మించారు. రూ. 15కోట్ల 27 లక్షలతో 320 పల్లె ప్రకృతి వనాలు, రూ.2కోట్ల 11 లక్షలతో 160 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. 177గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 52 లక్షల19 వేల మొక్కలను నాటి సంరక్షించే చర్యలు చేపట్టారు.
నియోజకవర్గంలోని 3087 మహిళా సంఘాల్లోని 28388 మంది సభ్యులకు సెర్ప్ ద్వారా రూ.471.42కోట్లు, వడ్డీలేని రుణాలను 3507 సంఘాల్లోని 21795 సభ్యులకు రూ.214. 39కోట్లు అందజేశారు. మహిళా సంఘాల ఆర్దిక పరిపుష్టికి సెర్ప్ ద్వారా ఆరు 309 సంఘాలకు రూ.5కోట్ల51లక్షలు మంజూరు చేయడంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు.
కేసీఆర్ కిట్లు
కొడకండ్ల మండలంలో 984, పాలకుర్తి 2052, దేవరు ప్పుల 1370, తొర్రూరు 427, పెద్దవంగర 32, రాయపర్తి మం డలంలో 45 కేసీఆర్ కిట్లను బాలింతలకు అందజేశారు. తొ ర్రూరు ఆసుపత్రిలో మార్చురీ సౌకర్యానికి ఏర్పాట్లు చేశారు.
రహదారుల మహర్దశ
రోడ్డు భవనాల శాఖ ద్వారా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్లాన్ వర్స్ గ్రాంట్, పీరియాడికల్ రినివల్స్గ్రాం ట్లు, డీఎంఎఫ్టీ గ్రాంటు, సీఆర్ఎఫ్ గ్రాంటు, నాబార్దు ద్వారా మంజూరైన రూ.322 కోట్ల 93 లక్షలతో 352.41 కి.మీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఉపాధి పథకంలో రూ.204 కోట్ల 90లక్షలతో సీసీ రోడ్లు,డ్రెయిన్లు, మెటల్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. సీఆర్ఆర్లో రూ.168 కోట్ల 53 లక్షలతో 280 కి.మీ నిడివితో రోడ్లు నిర్మించారు. ఎంఆర్ఆర్లో 149 కి.మీ మేర రోడ్లకు రూ.73 కోట్ల71 లక్షలు వెచ్చించారు. పీఎంజీఎస్వైలో 181 కి.మీ డబుల్ రోడ్లు, రూ.143 కోట్ల 24 లక్షలతో బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశారు. ఎస్డీఎఫ్లో తండాలకు రూ.8 కోట్ల 65 లక్షల వ్యయంతో బీటీ రోడ్లు నిర్మించారు.
రైతు బీమా: నియోజకవర్గంలోని 1027 కుటుంబాలకు రూ.51.35 కోట్లు సాయంగా అందించారు.
రైతు వేదికలు : నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల్లో రూ.6 కోట్ల 38 లక్షలతో 29 రైతు వేదికలు నిర్మించారు.
కల్యాణ లక్ష్మీ/షాదీముబారక్ : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో నియోజకవర్గంలో 9,162 మంది లబ్ధిదారులకు రూ.87.1 కోట్లు అందజేశారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లు : నియోజకవర్గంలో 4,561 ఇళ్లకు రూ.229కోట్ల 87లక్షలు వెచ్చించి పూర్తి చేశా రు.
నూతన జీపీ భవనాలు : 56 నూతన గ్రామ పంచాయతీ భవనాలకు రూ.11 కోట్ల 20 లక్షలు వెచ్చించి పూర్తి చేశారు.
చెక్‌డ్యాములు : యశ్వంతాపూర్, దేవరుప్పుల, పాలేరు, ఆకే రు వాగులపై 27 చెక్ డ్యాములను రూ.108 కోట్ల 11 లక్షలతో నిర్మించడంతో కిలోమీటర్ల పరిధిలో భూగర్భజలాలు పెరిగాయి.
మిషన్‌భగీరథ : నియోజకవర్గలోని 442 ఆవాసాలకు 478 ట్యాంకుల ద్వారా 1092 కి.మీ పైప్‌లైన్ ద్వారా శుద్ది చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్నారు. 61,767 నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు రూ.409.99 కోట్లు వెచ్చించారు.
మన ఊరు – మన బడి: ఆరు మండలాల్లో 104 ప్రభుత్వ పాఠశాలలను రూ.38.5 కోట్లతో ఆధునీకరించారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 33 వేల 29 ఎకరాలు మాత్ర మే సాగునీటి సౌకర్యం ఉండగా, నేడు 77 వేల 67 ఎకరాలకు పెంచారు. తెలంగాణ రాక ముందు 54 వేల 827ఎకరాలు మాత్రమే సాగులో ఉండగా, స్వరాష్ట్రంలో దే వాదుల, మిషన్ కాకతీయ, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ని యోజకవర్గంలో అదనంగా 74 వేల 988 ఎకరాలను సా గులోకి తెచ్చారు. దీంతో మొత్తం లక్షా 31వేల 894 ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఏర్పడింది. మిషన్ కాకతీయ ద్వారా రూ.89 కోట్ల15 లక్షలతో 331 చెరువులను అభి వృద్ధి చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 8,55,941 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పరిధిలో 79.59కిలోమీటర్ల మేర కాల్వల నిర్మాణా నికి రూ.99కోట్లు వెచ్చించి 27,150 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. దేవాదుల ప్రాజెక్ట్ పరిధిలో 359.62 కిలోమీటర్ల కాల్వల నిర్మాణానికి రూ.352 కోట్ల 15 లక్షలు వెచ్చించి 77,067 ఎకరాలకు సాగు నీరందిస్తున్నారు.
పాలకుర్తి, వల్మిడి, బమ్మెర కారిడార్…
పాలకుర్తి కవులు, కళాకారులకు పుట్టినిల్లు. ఇలాంటి పు ణ్యభూమిని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పాలకుర్తి – బమ్మె ర – వల్మిడి కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నారు. పాలకుర్తిలోని సోమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.16 కోట్ల 50 లక్ష లు మంజూరు చేశారు. వసతి గృహం, కల్యాణ మండపం, గోశాల, నాలుగు వైపులా ఆర్చి గేట్లు, సప్త ద్వార స్తంభాలు, గర్భగుడి మెట్ల పనులు జరుగుతున్నాయి. రూ.7 కోట్లతో వల్మిడి, రూ.14 కోట్లతో బమ్మెరలో పోతన మందిరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టూరిజం కారిడార్ అభివృద్ధికి రూ. 62 కోట్ల 50 లక్షలు వెచ్చిస్తున్నా రు. సోమనాథుడి విగ్రహం ఏర్పాటు, స్మారక మందిరం, లైబ్రరీ, పనులు జరుగుతున్నాయి. రూ.25 కోట్లతో హరితభవనం నిర్మించనున్నారు. రాయపర్తి మండలం వేంకటేశ్వరపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి 546 ఎకరాల భూములున్నాయి. భూముల నుంచి ఆదాయం లేకపోవడంతో ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల కోసం భక్తులు సమర్పించే కానుకల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి కృషితో రాష్ట్ర ప్రభుత్వం సన్నూరు వెంకన్న ఆలయాభివృద్ధికి ఇటీవల రూ.10 కోట్లు మంజూరు చేయడంతో ఆలయానికి మహర్ధశ పట్టనున్నది.
కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కు అడుగులు
చేనేత పరిశ్రమపై ఆధారపడిన నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వరంగల్‌లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్ టైల్ పార్ తరహాలోనే కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్ను ఏర్పా టు చేయబోతున్నారు. 50 ఎకరాల స్థలంలో నిర్మించే ఈ పార్క్ కు ఇటీవల మంత్రి కేటీఆర్ తొర్రూరు పర్యటన సందర్భంగా ఉత్తర్వులను మం త్రి దయాకర్‌రావుకు అందజేశారు. స్థలాన్ని శుక్రవారం దయాకర్‌రావు పరిశీలించారు. త్వరలోనే ఈ పార్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది.
శరవేగంగా తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రధాన కేంద్రమైన తొర్రూరు మేజర్ పంచాయతీ స్థాయి నుంచి డివిజన్ కేంద్రంగా, మున్సిపాలిటీగా ఉన్నతీకరించడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వరంగల్ – ఖమ్మం ప్రధాన హైవే పై వాణిజ్య, విద్యా, ఆరోగ్య రంగాల్లో పురోగతి సాధిస్తున్నది. మున్సిపల్ శాఖ ద్వారా మంత్రి దయాకర్ రావు ప్రత్యేక చొరవతో ఇప్పటి వరకు సుమారు రూ.150 కోట్లను వివిధ రూపాల్లో మంజూరు చేయించడంతో అభివృద్ధికి ఆదర్శంగా మారింది. సెంట్రల్ లైటింగ్, డివైడర్ల విస్తరణ, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, రూ.4 కోట్లతో మోడల్ మార్కెట్, రూ.2.13 కోట్లతో యతిరాజారావు పార్క్ అభివృద్ధి, రూ. కోటితో వైకుంఠ ధామాల నిర్మాణం, రూ.2.5 కోట్లతో మిషన్ భగరీథ పైప్లైన్ల విస్తరణ, సుమారు రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంతోపాటు 596 డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.