హనుమకొండ, నవంబర్ 20 : విద్యాభివృద్ధికి కృషి చేస్తానని హనుమకొండ జిల్లాస్థాయి ఉన్నత పాఠశాల సబ్జెక్ట్ ఫోరమ్స్సమన్వయ కమిటీ కన్వీనర్ అలిగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లాలోని ఉన్నత పాఠశాలల వివిధ సబ్జెక్ట్ ఫోరమ్స్జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ఆవరణలో ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కో-కన్వీనర్లుగా కొక్కుల సంపత్ కుమార్(ఆంగ్లం), అమరకొండ సంపత్‌కుమార్(బయోసైన్స్), కోశాధికారిగా భద్రయ్య(తెలుగు) ఎన్నికైనట్లు తెలిపారు.
అనంతరం మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ నిర్వహించే విద్యా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. జిల్లాలోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులలో పోటీ భావాన్ని పెంపొందించడానికి సబ్జెక్టు వారి పోటీ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. స్కూల్ కాంప్లెక్స్‌నుంచి మొదలుకొని మండల, జిల్లా, రాష్ర్టస్థాయి రిసోర్స్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
ఈ ఎన్నిక కార్యక్రమంలో తెలుగు ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నరేందర్‌రెడ్డి, భద్రయ్య, హిందీ ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాదత్ అలీ, గౌస్‌పాషా, ఇంగ్లీష్ ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంపత్‌కుమార్, కోలా రవికుమార్, గణితఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.భాస్కర్, బోయిన మహేష్, ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దొంతు శ్రీనివాస్, శశికలాధర్, బయోలాజికల్ సైన్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసు, అమర కొండ సంపత్‌కుమార్, సాంఘిక శాస్త్ర ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలిగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, కసుబోసుల నర్సయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫోరం బాధ్యులు సూరం రాము, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.