దుగ్గొండి, ఏప్రిల్,18: వలసవాదుల చేతులలో బందీ అయిన తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించిన గులాబీ జెండాయే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని వరంగల్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని దేశాయిపల్లి, రేబల్లె, పొనకల్, రాజ్య తండా, లక్ష్మీపురం గ్రామాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలుకతుర్తిలో ఈనెల 27న నిర్వహించే భారీ బహిరంగ సభకు మండల వ్యాప్తంగా నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా తరలి మహాసభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు.
అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జ్ మెరుగు రాంబాబు, కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, బొంపల్లి రజనీకర్ రెడ్డి, ఊరటి రవి, గుండెకారి రంగారావు, ల్యాండ రమేష్, కామిశెట్టి ప్రశాంత్, గుడిపల్లి జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, పాశం పోషాలు, బొమ్మగాని వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి మామునూరు సుమన్, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.