ములుగు, జనవరి 5(నమస్తే తెలంగాణ): మేడా రం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ల చెల్లింపులు అదనపు భారం కానున్నాయి. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి వెళ్లే ఎన్‌హెచ్-163లో మే డారం వరకు నాలుగు చోట్ల జాతీయ రహదారుల సంస్థకు టోల్ చెల్లింపులు చేయాల్సి ఉంది. అదేవిధం గా పస్రా నుంచి మేడారంతో పాటు పస్రా-తాడ్వా యి, ఏటూరునాగారం-తాడ్వాయి, తాడ్వాయి-మేడారం మార్గాల్లో నాలుగు చోట్ల అటవీశాఖ అధికారు లు గ్రీన్ ట్యాక్స్ పేరుతో టోల్ రుసుము వాహనదారు ల నుంచి వసూలు చేస్తున్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు కోట్లాది భక్తులు తరలివచ్చే క్రమం లో టోల్ గేట్ల వద్ద వసూళ్ల కోసం ఆపితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మేడారం జాతర సమయంలో టోల్ వసూళ్లను ర ద్దు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులకు, కార్లకు గూడూరు ఎన్‌హెచ్ టోల్ ప్లాజా వద్ద రూ. 120, జనగామ జిల్లా కోమళ్ల టోల్ ప్లాజా వద్ద రూ.120, హనుమకొండ జిల్లా కోమటిపల్లి టోల్‌ప్లా జా వద్ద రూ.65, ములుగు జిల్లా జవహర్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద రూ.40 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రీన్ ట్యాక్స్ పే రుతో వసూలు చేస్తున్న టోల్ గేట్ల వద్ద ఒక్కో కారుకు రూ.100, భారీ వాహనాలకు రెట్టింపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నుంచి మేడారం చేరుకునే వరకు ఒక్కో చిన్న వాహనదారుడు రూ.450 నుంచి రూ.500 వరకు, భారీ వాహనదారుడు రూ.900 నుంచి రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తున్నది. ఈ క్రమంలో భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ వసూళ్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో కోరినా, అవేమీ పట్టించుకోకుండా యథావిధిగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం సెలవు దినాల్లో ముందస్తు మొ క్కులకు వస్తున్న భక్తుల వాహనాలు ఇప్పటికే టోల్ గేట్ల వద్ద రూ.10 నుంచి 20 నిమిషాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు సమన్వయంతో నిర్ణయం తీసుకొని టోల్ గేట్ల వసూళ్ల నుంచి వాహనాలను మినహాయించాల్సిన అవసరం ఉన్నదని భక్తులు పేర్కొంటున్నారు.