హనుమకొండ, ఆగస్టు 17 : ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ నగరంలో సందడి చేసింది. హనుమకొండలోని నక్కలగుట్టలో జోస్ ఆలుక్కాస్ షోరూంను ప్రారంభించేందుకు వచ్చిన కీర్తిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు, ప్రజలు పోటీపడ్డారు.
అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మేయర్ గుండు సుధారాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వెరైటీ జువెలరీతో ధగధగ మెరిసిపోయింది.