గూడూరు, జూలై 16 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలతో పాటు, ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవి త, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అ న్నారు. బుధవారం గూడూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో అన్యాయం చేసిందని రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత గమనిస్తున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడతారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కేవలం స్థానిక ఎన్నికల స్టంటేనని, రైతులకు నేడు ఎరువులు, నీటి, విద్యుత్ కొరత ఉందన్నారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, కేవలం ఏడాదిన్నరలో కాంగ్రెస్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసిందన్నా రు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ఎన్నికల్లో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు రాష్ర్టానికి వస్తే, నేడు నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పోతున్నాయని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సూచించిన వ్యక్తులనే అభ్యర్థులుగా ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎండీ ఖాసీం, మాజీ ఎంపీపీ బానోత్ సుజాత, మాజీ వైస్ ఎంపీపీ ఆరె వీరన్న, మాజీ సర్పంచ్‌లు రాధానర్సింహనాయక్, జిల్లా యాకయ్య, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు బోడ కిషన్, రవి, నాయకులు సంపత్‌రావు, వేణుగోపాల్‌రెడ్డి, కఠార్‌సింగ్, చీదురు వెంకన్న, మన్మోహన్రెడ్డి, రహీం, గజ్జి యాకయ్య, బోడ ఎల్లయ్య, ఏ వెంకన్న పాల్గొన్నారు.