దుగ్గొండి : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను దుగ్గొండి మండల కేంద్రంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కుసారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ హాజరై ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన గొప్ప మేధావి జయశంకర్ సార్ అన్నారు. ఉద్యమంలో మేధావి వర్గాన్ని ప్రభావితం చేసి రాష్ట్ర ఆవిర్భావానికి తన జీవితాంతం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు కామిశెట్టి ప్రశాంత్, గుండెకారి రవీందర్, రంగారావు, యాదగిరి సుధాకర్, తోగురు వెంకటేశ్వర్లు, ఎండి అక్బర్, పులి రమేష్, మధు, తోగరు ప్రవీణ్, కక్కెర్ల ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.