కొలంబో: పాకిస్థానీ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్‌ను.. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) హగ్ చేసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా కొలంబోలో ఆదివారం పాకిస్థాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ వెళ్లాడు. అయితే ప్రీ మ్యాచ్ కార్యక్రమాన్ని మైదానంలో నిర్వహించారు. ఆ సమయంలో అక్కడకు అక్రమ్ కూడా వచ్చాడు. వసీం అక్రమ్‌తో రోహిత్ కాసేపు ముచ్చటించాడు. ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత హ్యాండ్‌షేక్ కూడా ఇచ్చాడు. మ్యాచ్ ప్రిపేరవుతున్న ఇండియన్ టీమ్తోనూ రోహిత్ గడిపాడు. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌కు అతను షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.
Rohit Sharma & Wasim Akram had a very friendly meetup tonight, they shared laugh, hand shaked & hugged too. pic.twitter.com/v0EILaxesj
— Rajiv (@Rajiv1841) February 15, 2026