దేవరకొండ, ఫిబ్రవరి 16 : దేవరకొండ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ను సోమవారం దేవరకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. దేవరకొండ ఆర్డీఓ రమణ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్‌గా పున్న సైలజా, వైస్ చైర్మన్‌గా జుబేర్య తబస్సుమ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్ సమక్షంలో నూతన పాలకవర్గం ప్రమాణం స్వీకారం చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతు తన మీది నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే బాలు నాయక్, మాజీ చైర్మన్ నర్సింహాతో పాటు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.