– వైస్ చైర్ పర్సన్‌గా మల్లీశ్వరి
కోదాడ, ఫిబ్రవరి 16 : కోదాడ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సజావుగా ముగియడంతో గత 10 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైర్మన్ పదవికి ఐదుగురు పోటీ పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సోమవారం కోదాడ మున్సిపాలిటీ ఆవరణలోని సమావేశ మందిరంలో నిర్వహించిన చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. తొలుత 35 మంది కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్ పర్సన్‌గా ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు, వైస్ చైర్‌పర్సన్‌గా దేవరం మల్లేశ్వరినీ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం చైర్పర్సన్ ఎర్నేని కుసుమ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఏకగ్రీవం చేసేందుకు, సహకరించిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, కౌన్సిల్ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కోదాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

కోదాడ చైర్‌పర్సన్‌గా ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు