హనుమకొండ, నవంబర్ 10 : అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు తిరుపతి, శ్రీశైలంకు హనుమకొండ నుంచి ఈనెల 14 నుంచి ఏసీ రాజధాని బస్సులు వరంగల్-1 డిపో నుంచి నడిపిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. హనుమకొండ నుంచి శ్రీశైలంకు 9 గంటలకు బయలుదేరి 18.00 గంటలకు చేరుకుంటుందన్నారు.
అలాగే హనుమకొండ నుండి తిరుపతి 8.40 గంటలకు బయలుదేరి 11.10 గంటలకు చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని త్రినగరి ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకొని సురక్షితముగా సుఖవంతముగా శుభప్రదంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి ఆ దేవదేవులను దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా రాగలరని ప్రజలను కోరారు.