న్యూశాయంపేట : ఎండల తీవ్రత నుంచి బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ( Water center) ఎంతో దోహదపడుతుందని బీఆర్ఎస్ ( BRS ) సీనియర్ నాయకులు గుండు సదానందం అన్నారు. గురువారం 31వ డివిజన్ న్యూశాయంపేట జంక్షన్లో ప్రజా సేవా సమితి వ్వవస్ధాపకులు వేల్పుల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా సదానందం మాట్లాడుతూ బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహిత వేణుగోపాల్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం స్పూర్తిదాయకమన్నారు. యువతను ఏకతాటిపై నడిపించడంలో ప్రజా సేవ సమితి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జానకీరాములు, శ్రీనివాస్, సందీప్, పాతిమాచారి, అమర్, సురేందర్ పాల్గొన్నారు.