ములుగు : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామానికి చెందిన ముదాం రవి ఇంటి గోడ కూలిపోయింది. బాధితుడు రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల సమయంలో భార్య రజితతో పాటు ఇంట్లోనే ఉన్నానని ఇంటి గోడ బయట వైపు కూలడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు.
నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చూపారని ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని వేడుకున్నారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని సూచించారు.